Tiruvuru: టెన్త్ ఫలితాల్లో తిరువూరు డివిజన్ టాప్..సరికొత్త రికార్డు
Tiruvuru: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ‘బడి పిలుస్తోంది’ భారీ ర్యాలీ నిర్వహించారు.
Tiruvuru: టెన్త్ ఫలితాల్లో తిరువూరు డివిజన్ టాప్..సరికొత్త రికార్డు
తిరువూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,ఆదేశాలతో డివిజన్ విద్యాశాఖ అధికారి, డివై ఈవో, శ్యామసుందర్రావు ఆధ్వర్యంలో, బడి పిలుస్తోంది ర్యాలీ,,బైపాస్ రోడ్డు వినాయకుడు గుడి నుండి, పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు,.ర్యాలీ అనంతరం డివిజన్ విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్, మాట్లాడుతూ, ఈ సంవత్సరం తిరువూరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో 500 పైగా, మార్కులు సాధించి ఎన్టీఆర్ జిల్లాల్లో,ప్రధమ స్థానంలో ఉంది. మా టీచర్స్ మండల గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ, తప్పనిసరిగా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి,,.అని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తుంది ప్రవేటు విద్యాసంస్థలలో సరైన సౌకర్యాలు ఉండవు,ఇరుకు గదులు,పిల్లలు ఆడుకోవడానికి ఆట గ్రౌండ్లో ఉండవు,అధిక ఫీజులు భారం, తల్లిదండ్రుల భరించాల్సి వస్తుంది..అదే మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ప్రభుత్వమే వారు చదువు బాధ్యత తీసుకొని ఒకటో తరగతి నుండి,,12వ తరగతి వరకు,నాణ్యమైన విద్యను అందిస్తుంది.తప్పనిసరిగా తల్లిదండ్రులు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి.విద్యావంతులను చేయండి అని Dy.e o తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల హెచ్ఎం రాజు, ముష్టికుంట్ల హెచ్ఎం వీరభద్రరావు, మరియు టీచర్స్ పాల్గొన్నారు.




