Nandigama: టీడీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది: మాజీ ఎమ్మెల్యే!

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ పాలనపై మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Naresh, Nandigama
Published on: 30 July 2026 10:05 AM IST
Nandigama
X

Nandigama: టీడీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది: మాజీ ఎమ్మెల్యే!

Nandigama: "అసలు నందిగామ నియోజకవర్గానికి ఏమైంది" "ఎందుకు ఈ దుస్థితి" అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు .

నందిగామ లో తెలుగుదేశం పార్టీకి అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు.

నందిగామ పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .

ప్రజా ప్రతినిధి అసమర్థత - చేతకానితనంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లో అంతర్గత విభేదాల వలన వారు వారే ప్రాణాలు తీసుకునేటట్లు. చేలరేగిపోతున్నారు. నిన్న రాత్రి తుర్లపాడు గ్రామంలో జెండా దిమ్మె విషయంలో - టీడీపీ వారే విచక్షణ రహితంగా కొట్టుకొని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ...

మొన్నటికి మొన్న విభరింతలపాడులో టీడీపీ కార్యకర్త అయిన ఉపాధి హామీ మహిళ - అదే పార్టీకి చెందిన నాయకుడి వేధింపుల వలన సెల్ఫీ వీడియో తీసుకొని ప్రాణాలు తీసుకుంది. వారం క్రితం ఒక బీసీ నాయకుడు అదే పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షుడి వేధింపుల వలన సాక్షాత్తు ఎమ్మెల్యే కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు .

నిన్న కాక మొన్న బెల్లంకొండ వారి పాలెం గ్రామంలో ఓ ప్రేమ కథలో తెలుగు దేశం నాయకుడి వేధింపుల వలన తన బిడ్డ పోలిస్ స్టేషన్ లో చిత్రహింసలు భరిస్తున్నాడు అని. అదే పార్టీకి చెందిన ఆ పిల్లాడి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

ఇవన్నీ చూస్తుంటే అసలు నందిగామ నియోజకవర్గానికి ఏమైంది. మీ చేతకానితనం వలన ఇన్నీ ప్రాణాలు పోతున్నాయి. ఎంతమంది బలై పోతున్నారు... ప్రజా ప్రతినిధి కి - షాడో ఎమ్మెల్యే కు డబ్బుల సంపాదన మీద ఉన్న యావ - పార్టీ పై నియోజకవర్గం పై లేకపోవడం తోనే ఇవన్నీ జరుగుతున్నాయి .

మొన్న వీరులపాడు లో తెలుగుదేశం పార్టీకి చెందిన పేకాట శిబిరాల నిర్వాహకుల మధ్య కూడా ఘర్షణ తలెత్తి వివాదం పోలీస్ స్టేషన్ కేసుల వరకు వెళ్తే మీరు చేతకాని తనం తో - వైసీపీ వాళ్ళు పోలీసులుకు పార్టీలు ఇచ్చి ఒక వర్గానికి కొమ్ము కాశారు. పోలీసులు వైసీపీ తో అంటకాగుతున్నారని ప్రచారం చేశారు.

మేము హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టడానికి వెళ్తే మా పార్టీ కి చెందిన 22 మంది పై ఉత్త పుణ్యానికి కేసు పెట్టారు. అదేంటి అంటే స్టేషన్ కి కార్యకర్తలు వచ్చారు అంటారు - ఒక పార్టీ ఎమ్మెల్సీ - మాజీ ఎమ్మెల్యే - ఆ పార్టీ నాయకులు - స్టేషన్ కు వెళ్తే కార్యకర్తలు రారా ?? ఇదేక్కడి విచిత్రమైన కేసు.

గత రెండేళ్లుగా నియోజకవర్గంలో మురికి పట్టిన రోడ్లు - బాగు చేయని కాలువలు - చూస్తున్నాం... ఇప్పుడు మురికి పరిపాలన - మురికి పట్టిన ప్రభుత్వ వ్యవస్థలు చూస్తున్నాం... పోలీస్ వ్యవస్థ ను కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారు... ఎవరి మీద కేసులు పెడుతున్నారు - ఎందుకు పెడుతున్నారో అర్థం కానీ పరిస్థితి -- పోలీసులు మా జేబు వ్యవస్థ అనే మాదిరిగా తెలుగు దేశం నేతలు వ్యవహరిస్తున్నారు ...

మేము దయ ఉంచి పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం... నందిగామలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది... ఇది ఎప్పుడు ఎవరిపై విసురుతారో తెలియని పరిస్థితి -- ఇప్పటికైనా పోలీసులు కాస్తంత శాంతిభద్రతలపై శ్రద్ధ పెట్టి నందిగామ నియోజకవర్గ ప్రజలు శాంతియుతంగా జీవించేలా చూడాలని వేడుకుంటున్నాం.

టిడిపి నేతలు కళ్ళు మూసుకొని లోకం గుడ్డిదని భావిస్తున్నారు.కానీ జరుగుతుందంతా ప్రజలు చూస్తున్నారు - గమనిస్తున్నారు . చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు.అని వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story