Kanchikacherla: కంచికచర్ల, వీరులపాడులో ఎక్సైజ్ దాడులు.. ముగ్గురు అరెస్ట్!

Kanchikacherla: కంచికచర్ల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులపై అధికారులు మెరుపు దాడులు చేశారు.

Naresh, Nandigama
Published on: 18 Jun 2026 4:39 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: కంచికచర్ల, వీరులపాడులో ఎక్సైజ్ దాడులు.. ముగ్గురు అరెస్ట్!

కంచికచర్ల: ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. కంచికచర్ల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో. వీరులపాడు, కంచికచర్ల మండలాల పరిధిలోని గ్రామాలలో అక్రమ మద్యం అమ్మకాలు జరిపే వారిపై( బెల్టు పాపులు). మీద దాడులు నిర్వహించటం జరిగింది.

ఈ దాడులలో కంచికచర్ల మండలం లోని కీసర, గని ఆత్కూరు గ్రామం, వీరులపాడు మండలంలోని. పొన్నవరం గ్రామంలో మొత్తం ముగ్గురు వ్యక్తులను. అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి మొత్తం 27 మద్యం సీసాలను స్వాధీన పర్చుకుని వారిపై cr.No: 57/26, 58/26, 59/26. క్రింద. కేసులు. నమోదు చేయడమైనది.

అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్చలు తీసుకోవటం జరుగుతుందని కంచికచర్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అప్రపూన్నీసా బేగం తెలిపారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్ తో పాటుగా సిబ్బంది . శ్రీనివాసు, బాబు, శివరామకృష్ణ , భాస్కర్ పాల్గొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story