Uyyuru: ఉయ్యూరులో డయేరియా కలకలం: రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు!
Uyyuru: ఉయ్యూరులో డయేరియా లక్షణాలతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
Uyyuru: ఉయ్యూరులో డయేరియా కలకలం: రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు!
ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు వాంతులు, విరేచనాలు వంటి డయేరియా లక్షణాలతో వైద్య సేవలు పొందుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణాజిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎం. నవీన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ అధికారులు సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
డయేరియా లక్షణాలు ప్రబలడానికి గల కారణాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉయ్యూరు, పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి నేతృత్వంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాధితుల ఇళ్ల పరిసర ప్రాంతాల నుంచి 4 నీటి నమూనాలు, సమీపంలోని హోటళ్ల నుంచి 5 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. ఈ నమూనాలను విశ్లేషణ కోసం చెన్నైలోని NABL గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం ఆహారం, నీటి నాణ్యతకు సంబంధించిన అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




