Pamarru: మ్మెల్యే వర్ల కుమార్ రాజాపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫైర్!
Pamarru:
Pamarru: మ్మెల్యే వర్ల కుమార్ రాజాపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫైర్!
పామర్రు: పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే. మిమ్మల్ని కూడా లోన్ వేసే టైం దగ్గరలో ఉందని వార్నింగ్.
గురజాడ గ్రామంలోని నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిన వీర్రాజు చెరువుని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారు .
ఇసుక, మట్టి బినామీగా ఉండి వ్యాపారం చేస్తూ కోట్లు దోచుకున్నారు. మీ అనుచరుడు లంకపల్లి సురేష్ గురజాడలోని బినామీ పేరుతో చెరువు తవ్వకాలు చేపట్టి సుమారు నాలుగు కోట్ల రూపాయల మట్టి దోచుకున్నారని ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్థానిక సీఐ ఫిర్యాదు చేసిన వ్యక్తి నీ లోపల వేయమని బెదిరించడం హాస్యాస్పదం. నియోజకవర్గంలో నిభానపూడి, రిమ్మనపూడి, కోసూరు, గురజాడ చెరువులలో ఎమ్మెల్యే వాటా ఎంతో బయట పెట్టాలి.
టిడిపి నాయకులు మాటలు వింటుంటే కోర్టు పై కూడా హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొమరవోలు లో సుమారు 23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టమని నిధులు కేటాయిస్తే, వాటిని కూడా దోచుకోవడానికి కుట్ర పన్నారని కచ్చితంగా ఈ విషయం పురందేశ్వరి దృష్టికి తీసుకెళ్తానని కైలే అనిల్ కుమార్ గారు అన్నారు.
కచ్చితంగా ఇసుక తిన్నవాళ్లును, మట్టి తిన్నవాళ్లను న్యాయస్థానంలో ఫిర్యాదు చేసి కక్కిస్తానని కైలే అనిల్ కుమార్ గారు అన్నారు.




