Vuyyuru: ఉయ్యూరులో గంజాయి ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్

Vuyyuru: ఉయ్యూరులో 4 కేజీల గంజాయితో పాటు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని, విక్రయాలకు పాల్పడుతున్న 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Ramana, Penamaluru
Published on: 15 Sept 2026 5:47 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో గంజాయి ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్

Vuyyuru: ఉయ్యూరు మండలం ఉయ్యూరు పట్టణంలో పోలీస్ స్టేషన్లో సిఐ రామారావ్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐ మాట్లాడుతూ

కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

మోటార్ సైకిల్ దొంగతనం అనుమానంతో గోశాల వద్ద షేక్ కాలీషా అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ విస్తృత గంజాయి సరఫరా నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. ఉయ్యూరు పరిసర ప్రాంతాలకు చెందిన 10 మంది యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 4 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన నిందితులు వివరాలు.

షేక్ కాలీషా

రాయపూడి దీపక్

అబ్దుల్ వషీద్

బుర్రా విజయ్

రత్నం సాయి సందీప్

షేక్ సుభాని

మహమ్మద్ ఇబ్రహీం

మహమ్మద్ రెహమాన్

కోలంటి జాన్ సందీప్ పాల్

మురారి పవన్ కుమార్

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

4 కేజీల గంజాయి

2 మోటార్ సైకిళ్లు

ఈ కేసులో గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితులు ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని గుర్తించామని, వారిపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. ఉయ్యూరు ప్రాంతంలో ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొంతమంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి దర్యాప్తు పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru