Gannavaram: గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల ధర్నా!
Gannavaram: గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల ఆందోళన.. రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, పోలీసుల అక్రమ అరెస్టులపై సీపీఎం నాయకులు మండిపాటు.
Gannavaram: గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల ధర్నా!
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద ఎయిర్పోర్ట్ విస్తీర్ణంలో ఇల్లు కోల్పోయిన బాధితులు ఆందోళన. తమ ఇళ్లను ఎయిర్పోర్టు విస్తీర్ణం లో సుమారు 10 సంవత్సరాల క్రితం అధికారులు పడగొట్టారని బాధితులు ఆందోళన.
కోల్పోయిన ఇళ్లకు బదులుగా స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కానీ, ఇల్లు పడగొట్టినందుకు నష్టపరిహారము ఒక్కో ఇంటికి 10 లక్షలు రావాలని బాధితులు ఆవేదన. సుమారు 13 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సాక్షాత్తు కలెక్టర్ వారి దగ్గరికి వెళ్లిన మాకు న్యాయం జరగలేదని వేదన.
సీఎం ను కలిసే అవకాశం మాలాంటి బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం లేదు. మాకు రావలసిన నష్టపరిహారం గురించి అడిగితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి కేసులు పెడతారా.
సిపిఎం జిల్లా నాయకులు లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఎయిర్ పోర్టు విస్తీర్ణం చేయడానికి సుమారు పది సంవత్సరాల క్రితం అధికారులు నాయకులు ప్రజలకు అనేక రకమైన హామీలు ఇచ్చారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో ఇల్లు నివాస ప్రాంతంలో బడి గుడి ఆస్పటల్ కట్టిస్తామని నమ్మబలికారు, కనీసం పడగొట్టిన మా ఇళ్లకు రావలసిన నష్టపరిహారం ఇవ్వడం లేదని నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు...
ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చేవరకు అద్దె డబ్బులు కూడా ఇస్తామని నమ్మబలికారు. ప్రభుత్వం నుంచి చట్టప్రకారం రావలసిన డబ్బులు అడిగినందుకు అరెస్టులు చేస్తారా. ఇక్కడ పేద ప్రజలకు డబ్బులు రావాలి న్యాయం జరగలేదని నాయకులకు కలెక్టర్లకు అధికారులకు అందరికీ తెలుసు.
చిత్తశుద్ధితో ప్రజలకు న్యాయం చేసే అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని లేరు. పోలీసుల వ్యవహార శైలి ప్రజల సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాలి కానీ మరో సమస్యకు వివాదాలకు దారి తీసే విధంగా ఉంది.
లాఠీలతో తూటాలతో ఈ ఉద్యమాన్ని ఆపలేరు. గన్నవరం గడ్డ అలాంటిది కాదు మీలాంటి అధికారులను చాలామందిని చూశాం. మేమేదో అడ్డగోలుగా వ్యవహరించాలని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూడటం లేదు. పేద ప్రజలకు న్యాయం చేయాలనే పోరాటాలు చేస్తున్నాం.




