Kanchikacherla: కంచికచర్ల మండలంలో మూరకొండ ఏడుకొండలు ప్రచార హోరు!
Kanchikacherla: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి, ఎస్. అమరవరంలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రచారం. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ అభ్యర్థి కోయ పద్మ గెలుపే లక్ష్యంగా పర్యటన.
Kanchikacherla: కంచికచర్ల మండలంలో మూరకొండ ఏడుకొండలు ప్రచార హోరు!
Kanchikacherla: కంచికచర్ల మండలంలో వేములపల్లి,ఎస్ అమరవరం గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ అభ్యర్థి కోయ పద్మ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
మండలంలో తిరుగుతున్న ప్రతి గ్రామంలో మూరకొండ ఏడుకొండలు కు బ్రహ్మరథం పడుతున్నారు. సెగ్మెంట్ లో ప్రచారం చేస్తుంటే ఎంపీటీసీ అభ్యర్థులకు జెడ్పీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు...మూరకొండ
కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థి "మూరకొండ ఏడుకొండలు" మాట్లాడుతూ కంచికచర్ల మండలం ఎస్ అమరవరం గ్రామంలో ప్రజల యొక్క స్పందన చూస్తుంటే కూటమి పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో అర్థం అవుతోంది
గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు బీటీ రోడ్లు పలు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్ని మేము ఎంపీటీసీ లుగా జడ్పీటీసీగా నేను గెలిచిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కారం చేస్తాము.
అధికారంలో ఉన్న వాళ్ళకు ఓటు వేస్తే అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మీ ఓటు, అభివృద్ధి ఆగిపోతుంది. ఎస్ అమరవరం, వేములపల్లి గ్రామం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం... జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు
ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు,ఎస్ అమరవరం నాయకులు నర్రా గోపి,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




