Tiruvuru: తిరువూరులో అకాల భారీ వర్షం: జలమయమైన లోతట్టు ప్రాంతాలు, బస్టాండ్
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కురిసిన అకాల భారీ వర్షానికి బస్టాండ్, రహదారులు జలమయమయ్యాయి. ఈ వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Tiruvuru: తిరువూరులో అకాల భారీ వర్షం: జలమయమైన లోతట్టు ప్రాంతాలు, బస్టాండ్
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పట్టణంలో కురిసిన అకాల భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణంలోని ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండులోకి సైతం వరద నీరు పోటెత్తడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
బస్టాండు పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఇటీవల వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ముఖ్యంగా రైతులకు నేటి భారీ వర్షం కొంత ఊరటనిచ్చింది. వర్షం కురవడంతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




