Ambarupeta: మున్నేరు టు తెలంగాణ.. అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి!

Ambarupeta: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట మున్నేరు వాగు నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక లారీలను, ఒక జేసీబీని నందిగామ పోలీసులు పట్టుకున్నారు.

Naresh, Nandigama
Published on: 28 Jun 2026 11:32 AM IST
Ambarupeta
X

Ambarupeta: మున్నేరు టు తెలంగాణ.. అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి!

నందిగామ (ఎన్టీఆర్ జిల్లా): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామ మునేటి నుండి తెలంగాణ రాష్ట్రాన్నికి తరలించడానికి సిద్దంగా ఇసుక లారీలను పట్టుకున్న నందిగామ పోలీసులు.

అంబారు పేట గ్రామ మునేటి నుంచి ట్రాక్టర్ ‌లతో గ్రామంలో ఒక ప్రదేశానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక కుప్పలను ఏర్పాటు చేస్తారు.

అక్కడ నుంచి నుండి జెసిబి మిషన్ సహాయంతో తెలంగాణ రాష్ట్రా నెంబర్ ప్లేట్ గల లారీలకు లోడ్ చేస్తున్నారు.

ఇసుక లారీలు అక్రమంగా రవాణా చేస్తుండగా సమాచారం తెలుసుకున్న నందిగామ పోలీసులు.

తెలంగాణ రాష్ట్ర నెంబర్ ప్లేట్లు ఉన్న 3 ఇసుక లారీలను ఒక జె.సి.బి మిషన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నందిగామ పోలీసులు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story