Kanchikacherla: అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి – ఏడుకొండలు!
Kanchikacherla: కంచికచర్ల 6వ సెగ్మెంట్‌లో జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ అభ్యర్థి వేల్పుల మౌనిక ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి.
Kanchikacherla: అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి – ఏడుకొండలు!
కంచికచర్ల: కంచికచర్ల పట్టణం 6 వ సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వేల్పుల మౌనిక తో కలసి ఎన్నికల ప్రచారం చేశారు కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు. కంచికచర్ల 6 వ సెగ్మెంట్ భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు.
6 వ సెగ్మెంట్ లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఎంపీటీసీ అభ్యర్థి, జెడ్పీటీసీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థి "మూరకొండ ఏడుకొండలు" మాట్లాడుతూ కంచికచర్ల పట్టణ 6 వ సెగ్మెంట్ లో తాగునీరు, డ్రైనేజీ, ఇంటి స్థలాలు పలు సమస్యలు ఉన్నాయి.
ఈ సమస్యలు అన్ని మేము ఎంపీటీసీ గా మౌనిక, జడ్పీటీసీగా నేను గెలిచిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కారం చేస్తాము. అధికారంలో ఉన్న వాళ్ళకు ఓటు వేస్తే అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే సర్వ దండగ. కంచికచర్ల పట్టణం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం... జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు




