Kanchikacherla: మోగులూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థి వెలగా వెంకటేష్ ప్రచారం

Kanchikacherla: కంచికచర్ల మండలం మోగులూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థి వెలగా వెంకటేష్ ఇంటింటి ప్రచారం; ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.

Naresh, Nandigama
Published on: 25 Nov 2026 8:42 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: మోగులూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థి వెలగా వెంకటేష్ ప్రచారం

కంచికచర్ల: కంచికచర్ల మండలం మోగులూరు గ్రామం కూటమి ప్రభుత్వ సర్పంచ్ అభ్యర్థి వెలగా వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు‌ వెలగా నరసింహారావు (DAP) కొడుకు వెలగా వెంకటేష్. తెలుగుదేశం పార్టీ గడ్డ మోగులూరు గ్రామం అని మరొకసారి రుజువు కాబోతుంది.

వెలగా వెంకటేష్ గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వెలగా వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉందని అన్నారు.

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాలు, మొదలగు అన్ని సమస్యలు త్వరితగతిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహకారంతో పూర్తి చేస్తాను. మోగులూరు గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి నన్ను. మా వార్డు సభ్యులు అందరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వెలగా వెంకటేష్.

Naresh, Nandigama

Naresh, Nandigama