Kankipadu: క్షణికావేశంలో మామను హతమార్చిన అల్లుడు.. నిందితుడు అరెస్ట్!

Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

Ramana, Penamaluru
Published on: 15 Jun 2026 6:51 PM IST
Kankipadu
X

Kankipadu: క్షణికావేశంలో మామను హతమార్చిన అల్లుడు.. నిందితుడు అరెస్ట్!

Kankipadu: కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో పిల్లనిచ్చిన మామను హత్య చేసిన ఘటనలో ముద్దాయిని కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ధర్మేంద్ర మాట్లాడుతూ.. గర్భవతి అయిన కూతుర్ని ఆసుపత్రి కి తీసుకు వెళ్లేందుకు వచ్చిన తండ్రి తిరువీధి నాగరాజు.

నాగరాజు స్వగ్రామం గన్నవరం మండలం దావాజీగూడెం, తన కూతురు గర్భవతి అవ్వడంతో రెగ్యులర్ చెకప్ నిమిత్తం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తండ్రి నాగరాజు తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనవరాలని పక్కింట్లో అప్పచెప్పిన పాత నాగరాజు పాపను పక్కింట్లో విడిచి ఆసుపత్రికి వెళ్ళటంతో తండ్రి అవినాష్ ఆగ్రహానికి గురయ్యాడని డిఎస్పి తెలిపారు.

సాయంత్రం తండ్రి అవినాష్ ఇంటికి వచ్చేసరికి పాప పక్కింట్లో ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని. గొడవ ఆపేందుకు ప్రయత్నించిన తండ్రి నాగరాజు ప్రయత్నించడంతో పక్కనే ఉన్న చెక్క పీటతో మామ నాగరాజు పై అల్లుడు అవినాష్ దాడి చేశాడు. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వలన ఒక ప్రాణం పోయిందని డీఎస్పీ తెలిపారు. ముద్దాయి అవినాష్ ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story