Kankipadu: కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం!
Kankipadu: కంకిపాడు జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దండమూడి పూజితను పోరంకి కార్యాలయంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా సత్కరించారు.
Kankipadu: కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం!
కంకిపాడు: కంకిపాడు జడ్పీటీసీగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి శ్రీమతి దండమూడి పూజిత గారిని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు నియోజకవర్గ కార్యాలయం పోరంకిలో ఘనంగా సత్కరించి,అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ,ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,కంకిపాడు మండల అభివృద్ధికి,ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు, ఈ విజయం కోసం కృషి చేసిన పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలందరికీ అభినందనలు తెలియజేశారు.




