Krishna: షైనింగ్ స్టార్స్ వేడుక 217 మందికి రూ.20 వేల నగదు!

Krishna: కృష్ణా జిల్లా పరిషత్ కన్వెన్షన్‌లో షైనింగ్ స్టార్స్ అవార్డుల వేడుక. 217 మంది ప్రతిభావంతులకు రూ. 20 వేల నగదు సత్కారం చేసిన కలెక్టర్ డీకే బాలాజీ.

Reddy, Pedana
Published on: 20 July 2026 5:54 PM IST
Krishna
X

Krishna: షైనింగ్ స్టార్స్ వేడుక 217 మందికి రూ.20 వేల నగదు!

Krishna: స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్‌లో సోమవారం షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ ఏడాది మొత్తం 217 మంది విద్యార్థులు అవార్డులకు ఎంపికయ్యారని,వారిలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 168 మంది,ఇంటర్మీడియట్‌లో 49 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేశామని చెప్పారు.ప్రతి విద్యార్థికి మెడల్, మెరిట్ సర్టిఫికేట్‌తో పాటు రూ.20 వేల నగదు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.

కృష్ణాజిల్లా అంటే విజ్ఞానానికి నిలయమని,ఎన్నో చరిత్రలు సృష్టించిన గడ్డగా ఈ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి,ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి.వి.జె. రామారావు, అధికారులు,నాయకులు విద్యార్థి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana

Next Story