Pedana: పెడనలో మినుము విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన!
Pedana: కృష్ణా జిల్లా పెడన మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. జ్యోతి రమణి ఆధ్వర్యంలో మినుము పంటలో విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన కల్పించారు.
Pedana: పెడనలో మినుము విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన!
పెడన: పెడన మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి K. జ్యోతి రమణి ఆధ్వర్యంలో మినుము పంటలో విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో కారణంగా ప్రకృతిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మినుము పంటలో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో ఏపీ సీఎన్ఎఫ్ డీపీఎం పార్థసారధి రైతులకు వివరించారు. విత్తన గుళికల తయారీని ప్రత్యక్షంగా డెమో ద్వారా రైతులకు చూపించారు.
మినుములో వచ్చే చీడపీడల నివారణకు ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల కషాయాలు వాడి నివారించుకోవచ్చని తెలియజేశారు. రసాయనాలు వాడకుండా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే మార్గాలను రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని S. జెన్నీ, గ్రామ వ్యవసాయ సహాయకులు,ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




