Pedana: పెడన ఎల్సీ నెం.31 రైల్వే గేట్ సమస్య పరిష్కరించాలని వినతి!

Pedana: కృష్ణా జిల్లా పెడన పట్టణం గూడూరు రోడ్డులోని ఎల్సీ నెం.31 రైల్వే గేట్ సమస్యను పరిష్కరించాలని విజయవాడ సీనియర్ డీఈఎన్ సూర్య ప్రకాష్‌కు వీణం శ్రీనివాస్ మిత్రబృందం వినతిపత్రం ఇచ్చింది.

Reddy, Pedana
Published on: 19 Nov 2026 11:11 AM IST
Pedana
X

Pedana: పెడన ఎల్సీ నెం.31 రైల్వే గేట్ సమస్య పరిష్కరించాలని వినతి!

పెడన: పెడన పట్టణ ప్రధాన రహదారి రైల్వే స్టేషన్ సమీపంలో గల గూడూర్ రోడ్డులో గల ఎల్ సి నెం:31 గేట్ సమస్య పరిష్కారం కొరకు విజయవాడ లోని Sr den co-ord bza సూర్య ప్రకాష్ IRSE కలిసి వినతి పత్రం అందచేసిన శ్రీనివాస్ వీణం మిత్రబృందం. కృష్ణాజిల్లా పెడన పట్టణం గూడూరు రోడ్ లోని ప్రధాన రహదారిలో ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న ఎల్సీ నెం:31 గేట్ సమయం తగ్గించి తగు చర్యలు తీసుకోవాలని.

పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మార్గనిర్దేశంలో తక్షణ చర్యలు తీసుకోవాలని తగు చర్యలు కొరకు విజయవాడ కేంద్ర కార్యాలయంలో sr den సూర్య ప్రకాష్ మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించి పట్టణ ప్రజలు నిర్దాక్షిణ్యంగా అనుభవిస్తున్న సమస్యలు ఎమ్మెల్యే గారి మాటగా ప్రజల తరఫున తెలిపి పరిష్కారం కోరడం జరిగింది.

అధికారి వారు వినతి పత్రం పూర్తిగా పరిశీలించి తమ సిబ్బంది ద్వార వాస్తవాలు పునఃపరిశీలించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. sr den వారి స్పందన చాలా సంతోషించ దగ్గ అంశం అని హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు మరియు బంధువులు అక్కుమహంతి రాజా,శ్రీనివాస్ వీణం,నాంచరావు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana