Pedana: విద్యార్థులకు చట్టాలపై అవగాహన: పెడన పోలీసుల పిలుపు

Pedana: కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పెడన మండలం కొపల్లి పాఠశాలలో విద్యార్థులకు చట్టాలు, సైబర్ భద్రతపై ‘చైతన్యం’ సదస్సు నిర్వహించారు.

Reddy, Pedana
Updated on: 1 Oct 2026 7:37 PM IST
Pedana
X

Pedana: విద్యార్థులకు చట్టాలపై అవగాహన: పెడన పోలీసుల పిలుపు

కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పెడన మండలం కొపల్లి పాఠశాలలో గురువారం విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘చైతన్యం’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెడన అదనపు ఎస్సై షేక్ బషీర్ పాల్గొని విద్యార్థులకు వివిధ చట్టాలు, మహిళలు, బాలల రక్షణకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా బాలలపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం, బాల్యవివాహాల నిరోధం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు తదితర అంశాలను వివరించారు. సోషల్‌ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు.

వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర సమయంలో 112, మహిళల కోసం 181, బాలల సహాయం కోసం 1098 వంటి సేవలను వినియోగించుకోవచ్చని వివరించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.

Reddy, Pedana

Reddy, Pedana