Machilipatnam: మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
Machilipatnam: మెగా డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్.
Machilipatnam: మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
మచిలీపట్నం: మెగా డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా మాజీ మంత్రి పేర్ని నానితోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు.
మెగా డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి పేర్ని నాని,మచిలీపట్నం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ పేర్ని కిట్టు, సింహాద్రి వికాస్, ఉప్పల రాము జడ్పీ చైర్ పర్సన్ ఉప్పల హారిక, దేవ భక్తుని చక్రవర్తి, వైఎస్ఆర్సిపి విద్యార్ధి విభాగం,యువత తదితరులు పాల్గొన్నారు.
Next Story




