Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Tadigadapa: తాడిగడప మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాల్గొని జాతీయ జెండాకు వందనం చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Tadigadapa: దేశ స్వాతంత్య్ర కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ,జాతీయ జెండా రెపరెపల మధ్య తాడిగడప మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని, జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తిని చాటారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Next Story




