Penamaluru: వికసిత భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్న మోదీ బోడే ప్రసాద్!

Penamaluru: టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూటమి శ్రేణుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Ramana, Penamaluru
Published on: 18 Sept 2026 10:13 AM IST
Penamaluru
X

Penamaluru: వికసిత భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్న మోదీ బోడే ప్రసాద్!

Penamaluru: ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూటమి తరఫున పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు...

పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి కూటమి కార్యకర్తల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు...

ఈ సందర్భంగా బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...

సుమారు 25 సంవత్సరాల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ గారు,మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే అభివృద్ధికి ఒక మోడల్‌గా నిలబెట్టారని పేర్కొన్నారు....

అదే అభివృద్ధి దృక్పథంతో నేడు భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.

ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే,మరోవైపు రైతులు,పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ

అభివృద్ధి – సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ వికసిత భారత నిర్మాణం వైపు దేశాన్ని నడిపిస్తున్నారని బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు... దేశ ప్రయోజనాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ,ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతున్న

శ్రీ నరేంద్ర మోదీ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,మరింత మనోధైర్యంతో దేశానికి సేవ చేస్తూ ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని బోడే ప్రసాద్ గారు తెలిపారు...

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 🇮🇳 ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు..

Ramana, Penamaluru

Ramana, Penamaluru