Penamaluru: పెనమలూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Penamaluru: పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
Penamaluru: పెనమలూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Penamaluru: పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ వేడుకల్లో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,దేశ ప్రజలకు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ. స్వేచ్ఛా భారతం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదన్నారు. స్వాతంత్య్రం అనేది కేవలం వేడుకగా జరుపుకునే రోజు మాత్రమే కాదని, దేశం పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకునే పవిత్రమైన రోజని పేర్కొన్నారు.
మహనీయులు కలలుగన్న బలమైన,అభివృద్ధి చెందిన,సమగ్ర భారతదేశం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు,యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని,ప్రజలంతా ఐక్యత, క్రమశిక్షణ,దేశభక్తి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న తరుణంలో, మన రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు.దేశం కోసం త్యాగం చేసిన వీరుల స్ఫూర్తితో,అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం.




