Penamaluru: యనమలకుదురులో ఘనంగా హర్ ఘర్ తిరంగా రన్ యాత్ర!

Penamaluru: యనమలకుదురులో మైనార్టీల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా రన్ యాత్ర. జాతీయ జెండాను ఆవిష్కరించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వంగవీటి ఆశ.

Ramana, Penamaluru
Published on: 16 Aug 2026 11:43 AM IST
Penamaluru
X

Penamaluru: యనమలకుదురులో ఘనంగా హర్ ఘర్ తిరంగా రన్ యాత్ర!

Penamaluru: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యనమలకుదురులో మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన *“హర్ ఘర్ తిరంగా రన్ యాత్ర”లో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ బోడే ప్రసాద్ గారు,వంగవీటి ఆశ గారితో కలిసి భారీ జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం మసీదు సెంటర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు,స్వాతంత్ర్య సమరయోధులు,త్యాగమూర్తుల ప్రతిమలకు నివాళులర్పించి,చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఎందరోస్వాతంత్య్ర సమరయోధులు,వీరుల అమూల్యమైన ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు,పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

సమైక్యతే ప్రగతికి పునాది అని పేర్కొంటూ, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు,ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలంటే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులకు,పాల్గొన్న పెద్దలకు ఎమ్మెల్యే గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, నిర్వాహక కమిటీ సభ్యులు,కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story