Poranki: పోరంకిలో అంకుర క్లినిక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్!
Poranki: పోరంకిలో అంకుర క్లినిక్స్‌ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ క్లినిక్ ద్వారా ప్రజలకు గైనిక్, పీడియాట్రిక్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Poranki: పోరంకిలో అంకుర క్లినిక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్!
Poranki: పోరంకి అంకుర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పోరంకి సెంటర్లో నూతనంగా అంకుర క్లినిక్స్ ప్రారంభోత్సవం. ముఖ్యఅతిథిగా హాజరైన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను తగ్గించుకుంటూ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం పోరంకి సెంటర్లో అందుబాటులోకి రావడం ఎంతో సంతోషమని అన్నారు, ప్రజలందరూ తప్పకుండా మీ సేవలో వినియోగించుకోవాలని చెప్పారు.
డాక్టర్ విశ్వేశ్వర రావు అంకుర హాస్పిటల్స్ రీజనల్ డైరెక్టర్ మాట్లాడుతూ ఉయ్యూరు, కంకిపాడు, పోరంకి, మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి గైనిక్ మరియు పీడియాట్రిక్ సేవలు అందుబాటులోకి ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ పోరంకి లోకి తీసుకొచ్చాము అని, అతి తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, ఇన్ పేషెంట్ సేవలు సిటీ బ్రాంచెస్ కి తరలిస్తున్నామని తెలిపారు.
అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులోకి పీడియాట్రిక్ మరియు గైనిక్ సేవలు తక్కువ ధరల కి అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలందరూ ఈ సేవలు తప్పక వినియోగించుకోవాలని మీడియా ముఖ్యంగా తెలిపారు.




