Penamaluru: పెనమలూరు: ఓవర్‌లోడ్ ఇసుక లారీని అడ్డుకున్న ఎమ్మెల్యే బోడే
Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
Penamaluru: పెనమలూరు: ఓవర్‌లోడ్ ఇసుక లారీని అడ్డుకున్న ఎమ్మెల్యే బోడే
కృష్ణాజిల్లా, పెనమలూరు: నియోజకవర్గంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకున్నారు. మద్దూరు నుంచి గోసాల వైపు వెళ్తున్న లారీని గమనించిన ఎమ్మెల్యే.. వెంటనే నిలువరించి, సమీపంలోని పోలీసులను పిలిపించారు. లారీపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఒకవైపు గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే.. మరోవైపు అధిక లోడుతో ఇసుక రవాణా చేయడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.




