Penamaluru: రూ. 12 కోట్లతో రహదారుల అభివృద్ధి: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో రూ. 12 కోట్లతో కీలక రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Penamaluru: రూ. 12 కోట్లతో రహదారుల అభివృద్ధి: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
కంకిపాడు మండలం: కందలంపాడు, తెన్నేరు, మారేడుమేక గ్రామాలలో సుమారు కోటి 80 లక్షల నిధులతో నిర్మించే కనెక్టివిటీ రోడ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
గత ప్రభుత్వ పాలనలో గుంతలమయమైన రహదారులకు శాశ్వత పరిష్కారం చూపుతూ పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
గత వారం రోజుల్లోనే సాస్కీ నిధులతో సుమారు ₹12 కోట్లతో పలు కీలక రహదారులకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు ముదునూరు–దోసరపాలెం,కందలంపాడు, కాటూరు–మాణికొండ,ముదునూరు–జబర్లపడి, మారేడుమాక–మాణికొండ,తెన్నేరు తదితర ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు...
ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తయ్యాయని, నెల నుంచి నెలన్నరలోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రోడ్లకు గత ఐదేళ్లలో కనీసం ప్యాచ్‌వర్క్ కూడా చేయకుండా వదిలేయడంతో రహదారులు గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు,రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధిని అస్తవ్యస్తం చేసిన పాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ,ఆగిపోయిన అభివృద్ధికి మళ్లీ వేగం తీసుకొస్తున్నామని తెలిపారు...
దాదాపు 20 ఏళ్ల క్రితం రైతుల నుంచి భూమిని సమకూర్చుకుని ఏర్పాటు చేసిన మారేడుమాక–మాణికొండ లింక్ రోడ్డును సుమారు ₹1 కోటి వ్యయంతో బీటీ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
మారేడుమాకలో దాదాపు 90 శాతం రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేశామని,మిగిలిన ప్రాంతాల్లో అవసరమైన కనెక్టింగ్ రోడ్లు, ముఖ్యంగా బీసీ కాలనీలో అవసరమైన డ్రైనేజీ పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
తెన్నేరు అభివృద్ధికి గత రెండున్నరేళ్లలో వివిధ నిధుల ద్వారా సుమారు ₹1.50 కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు,ఎస్ఈ కాలనీ రైల్వే గేటు నుంచి మండపం సెంటర్ వరకు ప్రధాన రహదారిని అభివృద్ధి చేసి గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించామని చెప్పారు.
అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారు అనేది కాదు, ప్రజలకు ఏం అవసరం ఆ అవసరాన్ని ఎలా తీర్చాలి అన్నదే మా ఆలోచన అని తెలిపారు.
వైసీపీ నేతలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు సవాల్...
ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో గ్రామాల్లో,పట్టణాల్లో వైసీపీ నేతలు చేసిన అభివృద్ధి ఏమిటో,ఎంత నిధులు ఖర్చు చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. మేము మాటలతో కాదు,రికార్డులతో ప్రజల ముందుకు వస్తున్నాం అని అన్నారు.
ప్రతి గ్రామంలో ఏ తేదీన ఏ పని ప్రారంభించాం, ఎక్కడ శంకుస్థాపన చేశాం,ఎక్కడ ప్రారంభోత్సవం చేశాం,ఎంత నిధులు ఖర్చు చేశాం అనే పూర్తి అభివృద్ధి రికార్డును ప్రజల ముందుంచుతామని తెలిపారు.
మున్సిపాలిటీల్లో కూడా ఏ రోడ్డు ఎక్కడ వేశాం, ఎంత నిధులు ఖర్చు చేశాం అనే వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం.. రికార్డులతో సమాధానం చెప్పడానికి సిద్ధం అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు సవాల్ చేశారు.
వైసీపీ నేతలు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఐదేళ్లు అధికారం ఇచ్చినప్పుడు మీ గ్రామానికి ఏం చేశారు. మీ పట్టణానికి ఏం చేశారు. ఎంత నిధులు తీసుకొచ్చారు.
ఎన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశారు.ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి,ఆ తర్వాతే ప్రజలను ఓటు అడగాలి అని అన్నారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని,ఈ రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి పనితీరును బేరీజు వేసుకోవాలని కోరారు. పెనమలూరు ప్రగతి కోసం... కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




