Nandigama: బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం.. హాజరైన సుజనా చౌదరి!

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట సెంటర్‌లో బీజేపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ప్రారంభించారు.

Naresh, Nandigama
Published on: 6 Sept 2026 10:25 PM IST
Nandigama
X

Nandigama: బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం.. హాజరైన సుజనా చౌదరి!

నందిగామ: నందిగామ పట్టణంలో రైతుపేట సెంటర్ వద్ద నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో సృజన ఫౌండేషన్ ద్వారా మిర్చి రైతులకు విత్తనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యా వైద్యానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉపాధి అవకాశాలు తమ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు ద్వారా అందిస్తు న్నట్లు పేర్కొన్నారు.

రాజకీయలో మనం ఏస్థాయిలో ఉన్న అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలకు న్యాయం చేయాలని ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలో బిజెపి పార్టీని బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే సృజన చౌదరి.

Naresh, Nandigama

Naresh, Nandigama