Nandigama: హాస్టల్ విద్యార్థినులకు మెటీరియల్ పంపిణీ చేసిన విప్ తంగిరాల సౌమ్య!

Nandigama: నందిగామ సాంఘిక సంక్షేమ వసతి గృహ బాలికలకు మెటీరియల్ పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. రూ. కోటి నిధులతో వసతి గృహాల మరమ్మత్తులు పూర్తి.

Naresh, Nandigama
Updated on: 19 July 2026 1:32 PM IST
Nandigama
X

Nandigama: హాస్టల్ విద్యార్థినులకు మెటీరియల్ పంపిణీ చేసిన విప్ తంగిరాల సౌమ్య!

Nandigama: నందిగామ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహంలో శనివారం నిర్వహించిన వసతి గృహ విద్యార్థినులకు అవసరమైన మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నివసిస్తున్న 65 మంది బాలికలకు ఒక్కొక్కరికి ఒక స్వెట్టర్, రెండు నైట్ డ్రెస్సులు, ఒక బ్లాంకెట్, ఒక టర్కీ టవల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, "నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు. తల్లిదండ్రులు, ప్రభుత్వం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి" అని విద్యార్థినులకు సూచించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి కోసం రూ. కోటి నిధులు కేటాయించి మరమ్మత్తు పనులను పూర్తి చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో ఆనందం వ్యక్తం చేసిన వసతి గృహ బాలికలు, తమకు అవసరమైన మెటీరియల్‌తో పాటు వసతి గృహాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు,అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story