Nandigama: నందిగామ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు 40 మంచాల అందజేత!

Nandigama: ఎన్టీఆర్ నందిగామ అశోక్‌నగర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం దాతల సహకారంతో సమకూర్చిన 40 మంచాలను అందజేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.

Naresh, Nandigama
Published on: 29 Sept 2026 2:20 PM IST
Nandigama
X

Nandigama: నందిగామ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు 40 మంచాల అందజేత!

Nandigama: నందిగామ పట్టణం అశోక్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యార్థం దాతల సహకారంతో సమకూర్చిన 40 మంచాలను కూటమి నేతలు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో దాతలు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని, వారి సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు...

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి, ఉన్నత లక్ష్యాలను సాధించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే సౌమ్య ఆకాంక్షించారు...

విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు అధికారులు విద్యార్థులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు...

Naresh, Nandigama

Naresh, Nandigama