Krishna: లంకపల్లి భూముల సమస్య తేలుస్తాం: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

Krishna: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం లంకపల్లి భూముల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు.

Bhanu, Pamarru
Published on: 1 Oct 2026 6:35 PM IST
Krishna
X

Krishna: లంకపల్లి భూముల సమస్య తేలుస్తాం: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే కార్యాలయంలో లంకపల్లి భూముల సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు లంక రైతులు వినతిపత్రాన్ని అందించారు.

ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కామెంట్స్..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రాజకీయ లబ్ది కోసం లంకపల్లి భూముల వ్యవహారం మొదలుపెట్టారు. పూర్వకాలం లంకపల్లిలో జమిందారీ భూములను 17 కుటుంబాలు సొసైటీగా ఏర్పడి సుమారు 371 ఎకరాలు జమిందారు వద్ద అగ్రిమెంట్ రాయించుకున్నారు.

ప్రస్తుతం ఆ 17 కుటుంబాల వారసులు సుమారు 220 మంది తమకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాలని తనను కోరారు.

ఈ విషయమై నేను అధికారులతో మాట్లాడాను, ఈ లంక భూముల్లో ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వారందరి పక్షాన అసెంబ్లీలో చర్చిస్తా, అలాగే సీఎం చంద్రబాబుకు సమస్య గురించి వివరించి పరిష్కారానికి కృషి చేస్తా, ఇద్దరు ముగ్గురు పార్టీ కార్యకర్తలను మాజీ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి ఒక భ్రాంతి మాజీ ఎమ్మెల్యే కైలే సృష్టిస్తున్నాడు.

గత వైసీపీ పాలనలో ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న కైలే అనిల్ కుమార్‌కు అప్పుడు లంకపల్లి భూముల సమస్యలు పట్టలేదుగాని, ఇప్పుడు ఏదో ఒక అలజడి సృష్టించే దిశగా పని చేయడం హేయమైన చర్య.

ప్రజలు మొన్న ఎన్నికల్లో ఓ మూలన కూర్చోబెడితే, సుపరిపాలన అందిస్తున్న నాపై అడ్డగోలు మాటలు మాట్లాడడం కైలే అనిల్‌కు పరిపాటిగా మారింది. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే నాతో ఊసరవెల్లి రాజకీయాలు చేసే కైలే ఎలా సరితూగుతాడు.

గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కైలే లంకపల్లి భూములను కొట్టేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం కాదా. లంకపల్లిలో సుమారు 300 మంది లంక రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాము

అలాగే మిగతా బాధిత రైతులకు కూడా న్యాయం చేసే వరకు నేను విశ్రమించను. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Bhanu, Pamarru

Bhanu, Pamarru