Nandigama: నందిగామ రూరల్ సీఐకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు!
Nandigama: వినాయక చవితి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో నందిగామ రూరల్ సీఐకి బీజేపీ నేతల వినతిపత్రం. పీస్ కమిటీలు ఏర్పాటు చేయాలని మహేష్ బాబు డిమాండ్.
Nandigama: నందిగామ రూరల్ సీఐకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు!
Nandigama: కంచికచర్ల మండల భారతీయ జనతా పార్టీ తరుపు నుంచి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 'పర్యవేక్షించే భాద్యత పోలిసేవారి పై ఉందని వినాయక చవితి ఉత్సవాలు కూడా మరీ 2 రోజుల్లో సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతాలుకు ఏటువంటి విఘాతం కలుగుకుండా పీస్ కమిటి ఏర్పాటు చేసి, గణేష్ ఉత్సవాలను సజావుగా సాగే విధంగా చూడాలని కోరుకుంటున్నానని, ముందస్తు చర్యలో భాగంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గుర్తించి వారి పై చర్యలు తీసుకోవాలని. స్థానిక సంస్థ ఎన్నికలను ఎటువంటి అవాంఛనయ ఘటనలు.
జరుగకుండా ఉండాలని మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాలవ మహేష్ బాబు నందిగామ రూరల్ సీఐ నాయుడు కి తెలియపరిచారు. అర్జీలో ఉన్న ముఖ్యమైన అంశాలను పరిగణించి. తగు చర్యలు తీసుకోవాలని సీఐ ను మరొక సారి కోరారు కంచికచర్ల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాలవ మహేష్ బాబు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కంచికచర్ల మండలం అధ్యక్షులు కాలవ మహేష్ బాబు, వీరులపాడు మండల అధ్యక్షులు పూల వెంకటేశ్వరరావు (జక్కన్న), ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ వాడపల్లి విజయబాబు తదితరులు పాల్గొన్నారు.




