Nandigama: నందిగామ టీడీపీ తీరుపై మాజీ ఎమ్మెల్యే జగన్ ఫైర్

Nandigama: టీడీపీలో ఆత్మహత్యాయత్నాలు, వేధింపులు పెరిగిపోయాయని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు విమర్శలు. ఎమ్మెల్యే ఆఫీసులోనే బీసీ నేత ఆత్మహత్యాయత్నం.

Naresh, Nandigama
Published on: 18 July 2026 4:53 PM IST
Nandigama
X

Nandigama: నందిగామ టీడీపీ తీరుపై మాజీ ఎమ్మెల్యే జగన్ ఫైర్

నందిగామ: పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు. తెలుగుదేశం ప్రభుత్వంలో.... టిడిపి వారే ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి కారణం ఎవరు ??.. అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే.

డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో చనిపోతే - వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటూ ప్రచారం చేసిన టిడిపి ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ లోనే టిడిపి బీసీ నాయకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు... దీనికి ఏం సమాధానం చెబుతారు... ???

గత రెండు రోజుల క్రితం నూజివీడు నియోజకవర్గంలో ఐ టిడిపి కార్యదర్శి మణిరత్నం. ఆ పార్టీలో జరుగుతున్న ఘటనలపై వారిని ప్రశ్నించాడని కక్షతో... సొంత తెలుగుదేశం పార్టీ నాయకులే అతన్ని కారుతో గుద్ది. చంపడానికి యత్నించి. అతని పై వాహనంతో దాడి చేస్తే... అతను చావు బతుకుల మధ్య హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు.

నిన్న కాక మొన్న నందిగామ నియోజకవర్గంలో చందర్లపాడు మండలంలో ఉపాధి హామీ మహిళ. టిడిపి నాయకుడి వేధింపుల వలన ఎమ్మెల్యే సౌమ్యక్క నా పిల్లలను కాపాడు... అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన అందరు చూశారు... ఆ తర్వాత మీరు ఆమెకు - ఆ కుటుంబానికి చేసిన న్యాయం ఏంటో ?? అందరికీ తెలుసు.

నేడు నందిగామ పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల నాయకుడు. 2 దశాబ్దాలుగా టిడిపికి సేవ చేస్తూ. ఎంతో నిబద్ధతతో పనిచేసే తోటకూర సూర్యనారాయణ నేడు ఎమ్మెల్యే సమక్షంలోనే. ఆమె కార్యాలయంలోనే. ఒంటిపై పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి. ఆ ఆత్మహత్యాయత్నానికి ఉరికొల్పింది ఎవరిని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story