Nandigama: కోనేరు ఆక్రమణల తొలగింపుపై హిందూ సంఘాల నిరాహార దీక్ష
Nandigama: నందిగామలో సోమేశ్వర స్వామి కోనేరు ఆక్రమణలను తొలగించడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభం.
Nandigama: కోనేరు ఆక్రమణల తొలగింపుపై హిందూ సంఘాల నిరాహార దీక్ష
నందిగామ: శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన సోమేశ్వర స్వామి పుష్కరిణి( కోనేరు) పై ఆక్రమణల తొలగింపు విషయమై రెవెన్యూ అధికారుల జాప్యం పైహిందూ సంఘాలు శివాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు.
కోనేరు ఆక్రమణలు తొలగించి దేవాదాయ శాఖకు ఆ స్థలాన్ని అప్పగించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన దానిని అమలు పరచకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు హిందూ సంఘాలు.
మొదటగా నిరాహార దీక్షలు మూడు రోజులు పాటు కొనసాగిస్తామని ఈ మూడు రోజులలో కోనేరు అక్రమణ తొలగించి దేవస్థానానికి కోనేరును స్వాధీన పరచకపోతే సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని తెలిపారు.




