Nandigama: వైసీపీకి ఓటేస్తే సున్నాకి వేసినట్టే: మూరకొండ ఏడుకొండలు!

Nandigama: వైసీపీకి ఓటు వేస్తే సున్నాకి వేసినట్లేనని, అభివృద్ధి కోసం టీడీపీకే ఓటెయ్యాలని కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు అన్నారు.

Naresh, Nandigama
Published on: 22 Oct 2026 7:06 PM IST
Nandigama
X

Nandigama: వైసీపీకి ఓటేస్తే సున్నాకి వేసినట్టే: మూరకొండ ఏడుకొండలు!

నందిగామ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే సున్నా కి ఓటు వేసినట్టే. మూరకొండ ఏడుకొండలు. కంచికచర్ల మండల జడ్పీటీసీ మూరకొండ ఏడుకొండలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ గా అభ్యర్థిగా గనిఆత్కూరు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు వివరిస్తున్నారు మూరకొండ ఏడుకొండలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకరాలేరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే సున్నా కి వేసినట్టే వారి వలన ఏమి అభివృద్ధి జరుగదు. అభివృద్ధి జరగాలంటే తెలుగు దేశం పార్టీ కి ఓటు వేయాలని కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు తెలిపారు.

Naresh, Nandigama

Naresh, Nandigama