Nandigama: నందిగామ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల అందజేత

Nandigama: నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో 13 మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు.

Naresh, Nandigama
Published on: 16 July 2026 1:30 PM IST
Nandigama
X

Nandigama: నందిగామ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల అందజేత

Nandigama: పేరకలపాడు గ్రామంలో ఉజ్వల వెలుగులు..13 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందజేసిన మార్కెట్ యార్డు చైర్మన్ కోగంటి బాబు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికే పెద్దపీట – ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం కోగంటి స్పష్టం.

కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 13 మంది అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లను కంచికచర్ల మండల మార్కెట్ యార్డు చైర్మన్, తెలుగు దేశం పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షులు కోగంటి బాబు, గ్రామ మాజీ సర్పంచ్, నందిగామ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మన్నె సాత్విక గ్రామ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కోగంటి బాబు మాట్లాడుతూ:

మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక భారం తగ్గించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మహిళల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఉజ్వల పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

మాజీ సర్పంచ్ మన్నె సాత్విక మాట్లాడుతూ:

గ్రామీణ మహిళలు పొగరహిత వంటగదులతో ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా ఉజ్వల పథకం ఎంతో దోహదపడుతోందని మన్నె సాత్విక అన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story