Nandigama: నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోకపై టీడీపీ ఘాటు విమర్శలు
Nandigama: నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై టీడీపీ నాయకుల ఖండన. సవాళ్లు విసిరే ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు, పలు అంశాలపై ప్రశ్నల వర్షం.
Nandigama: నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోకపై టీడీపీ ఘాటు విమర్శలు
నందిగామ: మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అసత్యాలు, ఆరోపణలు, చవకబారు వ్యాఖ్యలతో నందిగామ తెలుగుదేశం పార్టీ లో నియోజకవర్గ ముఖ్య నాయకుల ఖండన. చర్చకు కావాల్సింది వేదిక ఒక్కటే కాదు.
ప్రశ్నకు జవాబు చెప్పే నిజాయితీ మాటకు కట్టుబడే నిబద్ధత ఎదుటివారిని గౌరవించే కనీస సంస్కారం కూడా! ముందుగా — సవాలు విసిరే అర్హత మీకుందా?
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని — సంక్రాంతి ముందు హరిదాసులు వీధుల్లోకి వచ్చినట్టు — మొండితోక జగన్మోహన్ రావు గారు పత్రికా సమావేశాలతో ప్రత్యక్షమై "దమ్ముంటే చర్చకు రావాలి" అంటూ సవాళ్లు విసురుతున్నారు. కానీ చర్చ అంటే మైకు ముందు అరవడం కాదు — ప్రశ్నను వినడం, జవాబు చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం. ఆ అర్హత వారికి ఎంతుందో వారి చరిత్రే చెబుతోంది.
"వైసీపీ ఓడిపోతే రాజీనామా చేస్తా" అని సొంత తమ్ముడు విసిరిన ఛాలెంజ్ నేటికీ నెరవేరలేదు. ఎన్నికల ప్రచారంలో "మన రాజధాని ఏది?" అని అడిగిన సామాన్యులకు దక్కింది దూషణలు, రాడ్ల దెబ్బలు. రెండేళ్లుగా మేము లిఖితపూర్వకంగా అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ నేటికీ జవాబు లేదు. పైగా — తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే గత నెలలోనే పత్రికలను బహిరంగంగా దహనం చేసినవారు, ప్రభుత్వంపై కథనాలు రాగానే అవే పత్రికలను ప్రమాణంగా చూపడం — ఈ ద్వంద్వ వైఖరే వారి రాజకీయ దివాలాకు నిదర్శనం.
ఇసుక — కాటా వేసి అమ్మిన మీరేనా దోపిడీ మాట్లాడేది?
కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్న చోట ఎవరైనా తమ అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు — అందరికీ ఉచితంగా దొరికే చోట అక్రమ ఆదాయానికి అవకాశమే లేదు. కానీ 2019–2024 మధ్య ఇసుకను కేజీల లెక్కన కాటా వేసి అమ్మి, రీచ్‌లను అడ్డాలుగా మార్చి, నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చి కార్మికులను వలసల పాలు చేసిన పాలన ఎవరిదో ప్రజలు మరిచిపోలేదు...
ఆనాడు కాగితం లేకుండా వెళుతున్న ఇసుక లారీలను మా నాయకులు నడిరోడ్డుపై నిలబెట్టి యంత్రాంగాన్ని పిలిపిస్తే — అక్రమ రవాణాపై కేసులు పెట్టకపోగా, లారీలను పట్టించిన వారిపైనే కేసులు పెట్టి, నాటి అధికారుల చేత బూటు కాలితో తొక్కించిన దుర్మార్గపు చరిత్ర నాటి పత్రికల్లో ఇప్పటికీ సజీవం.
ఇక వారు చూపే "ఆధారాలన్నీ" ఈ ప్రభుత్వ యంత్రాంగమే పట్టుకున్న లారీలు, నమోదు చేసిన కేసులు — అక్రమానికి ప్రయత్నించినవారు ఎవరైనా, ఆఖరికి అధికార పార్టీ వారైనా చట్టం పనిచేస్తోందనడానికి ఇది రుజువు. ఇది దోపిడీకి కాదు — దోపిడీని అడ్డుకుంటున్న పాలనకు నిదర్శనం.
గ్రావెల్ — మీరే ఒప్పుకున్నారు, మీరే జవాబు చెప్పాలి...
నిన్నటి సమావేశంలో "మా హయాంలో గ్రావెల్ జగనన్న కాలనీలకు తోలాం" అని జగన్మోహన్ రావు గారే స్వయంగా అంగీకరించారు. ఆ గ్రావెల్‌కు కోట్లలో బిల్లులు పొందిన రుజువులు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి — మరి ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ రసీదులు ఎక్కడ? రవాణా పర్మిట్లు ఎక్కడ? తవ్వకాల అనుమతి పత్రాలు ఎక్కడ?
ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదు — వచ్చేది ఎదురుదాడే. జవాబు చెప్పలేని మౌనం కంటే పెద్ద సమాధానం లేదు. "వసూల్ బ్రదర్స్" అనే పేరు పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదు — వారి వ్యవహారశైలి చూసిన వారి సొంత పార్టీ నాయకులే అన్న వాస్తవమూ నందిగామకు తెలుసు.
ఆసుపత్రి — విద్యాలయం: ఐదేళ్లూ కాగితాలు, ఏడేళ్లుగా క్రెడిట్ చోరీ...
వంద పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయాల ఘనత తమదేనని ఏడేళ్లుగా చెప్పుకుంటున్న మొండితోక సోదరులకు మా పాత ప్రశ్నలే మళ్లీ — మీ పాలనలో విడుదల చేయించిన నిధులెంత? కొన్న స్థలమెక్కడ? రైతులకు చెల్లించిన పరిహారమెంత? ప్రారంభించిన నిర్మాణమేది? — ఒక్కదానికీ నేటికీ ఆధారంతో జవాబు లేదు...
మంజూరు వివరాల అధికారిక రికార్డులు, ప్రకటనలు, వీడియోలు అన్నీ ఎన్నోసార్లు ప్రజల ముందుంచాం — ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల ఈ సాంకేతిక యుగంలో అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమవుతుందనే పాత ధోరణి పనిచేయదు...
ఇక "మేము ప్రతిపాదించిన చోట కడితే మాకు పేరొస్తుందని విద్యాలయ స్థలం మార్చారు" అనే కొత్త ఆరోపణ — వారి వైఫల్యానికి వారే ఇచ్చిన ఒప్పుకోలు! ఎందుకంటే ఆ స్థలం వారు సమకూర్చింది కాదు — తంగిరాల సౌమ్య గారు తన హయాంలో G+3 ఇళ్ల కోసం సేకరించిన స్థలం! ఆమె సేకరించిన స్థలంలో కడితే ఘనత ఆమెకే దక్కుతుంది — ఈ చిన్న లాజిక్ మరిచి, "మా ఐదేళ్లలో ఒక్క సెంటు స్థలమూ సమకూర్చలేకపోయాం" అన్న నిజాన్ని పరోక్షంగా వారే ఒప్పుకున్నారు.
ఇద్దరు సోదరులు, రెండు పదవులు, ఐదేళ్ల అధికారం — మిగిల్చింది శూన్యం! ఒక మహిళా ప్రజాప్రతినిధి రెండేళ్లలోనే ₹103 కోట్ల కృష్ణా జలాల పథకం, వేదాద్రి–కంచల ఎత్తిపోతల, హరిత నందిగామ వంటి వందల కోట్ల పనులు ఆచరణలోకి తెచ్చారు — ఈ పనులను ఎదుర్కోలేని అసహన.




