Nandigama: నందిగామలో దేవాలయ ఆక్రమణ భూముల కూల్చివేత!
Nandigama: నందిగామ దేవస్థానం భూమిలో అక్రమ కట్టడాల కూల్చివేత. 79 సెంట్ల భూమిని ఆలయానికి అప్పగించాలని హైకోర్టు తీర్పు.
Nandigama: నందిగామలో దేవాలయ ఆక్రమణ భూముల కూల్చివేత!
Nandigama:నందిగామ శివారు ప్రాంతం చందాపురం బైపాస్ లో సర్వే నెంబర్ 822-2 లో శ్రీ సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 79 సెంట్లు భూమిని చందాపురం గ్రామానికి చెందిన కొందరు కొంతకాలంగా ఆక్రమించుమకొని దానిలో 12 సెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు. ఆక్రమణపై దేవస్థానం చైర్మన్ రాజా వాసిరెడ్డి మురళి రాఘవ కుమార్ హైకోర్టుని ఆశ్రయించారు.
దేవస్థానం రికార్డులను పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు ఆక్రమించిన భూమిలో కట్టడాలను తొలగించి శ్రీ సుఖశామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 79 సెంట్లు భూమిని అప్పగించాలని తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ జెసిబి మిషన్ల ద్వారా అక్రమ కట్టడాలను తొలగించారు.




