Pedana: టీడీపీ క్యాడర్ సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన బోడే ప్రసాద్!
Pedana: ఈ నెల 17న పెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. టీడీపీ క్యాడర్ సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ పరిశీలించారు.
Pedana: టీడీపీ క్యాడర్ సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన బోడే ప్రసాద్!
Pedana: పెడన పట్టణంలోని ఫ్లైఓవర్ ఎదురుగా గురువారం ఉదయం 10 గంటలకు జరగనున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ సమావేశానికి రాష్ట్ర విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు స్వయంగా రంగంలోకి దిగి సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు,పెడన ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షులు
శ్రీ వీరంకి వెంకట గురుమూర్తి గారు అధికారులు,పార్టీ నాయకులతో కలిసి ప్రతి ఏర్పాటును సమీక్షించారు.
సభకు భారీగా తరలివచ్చే టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ,భద్రత,రాకపోకల మార్గాలు, తాగునీరు,తదితర అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని బోడే ప్రసాద్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కార్యకర్తలే టీడీపీకి బలం కార్యకర్తల సమావేశమే పార్టీకి మరింత బలాన్ని ఇచ్చే వేదిక అన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పిలుపునిచ్చారు.
17న పెడనలో టీడీపీ జోష్ కనిపించాలి. యువనేత నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలకాలి, భారీగా తరలివచ్చి క్యాడర్ సమావేశాన్ని విజయవంతం చేయాలి.తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఐక్యత.




