Nandigama: కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థి గణేష్‌ను గెలిపించాలి: సౌమ్య!

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థి గూడవల్లి గణేష్‌ను ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు.

Naresh, Nandigama
Published on: 25 Nov 2026 2:49 PM IST
Nandigama
X

Nandigama: కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థి గణేష్‌ను గెలిపించాలి: సౌమ్య!

నందిగామ: కంచికచర్ల పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సర్పంచ్ అభ్యర్థి గూడవల్లి గణేష్,13,14,15 వార్డు సభ్యులు కంభంపాటి తిరుమలరావు,చింతల చంద్రకళ, లకావత్ నాగేశ్వరరావు తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంచికచర్ల పట్టణం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలి తెలిపారు.

కూటమి తరపున పోటీ చేస్తున్న వార్డు నెంబర్లను అందరినీ గెలిపించాలని కోరారు. రెండున్నర సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి ,సంక్షేమం చేస్తున్నాము అందుకే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అదే తీర్పు జరగపోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా వస్తుంది. ప్రజలు ఇచ్చినా తీర్పుతో ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.

Naresh, Nandigama

Naresh, Nandigama