Tunikipadu: తునికిపాడులో వరుస దొంగతనాలు రంగంలోకి దిగిన డీసీపీ, ఏసీపీ!
Tunikipadu: ఎన్టీఆర్ జిల్లా తునికిపాడులో వరుస దొంగతనాలు. బాధితుల ఇళ్లను పరిశీలించిన డీసీపీ లక్ష్మీనారాయణ.
Tunikipadu: తునికిపాడులో వరుస దొంగతనాలు రంగంలోకి దిగిన డీసీపీ, ఏసీపీ!
Tunikipadu: గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ఇటీవల వరుస దొంగతనాలు చోటుచేసుకున్నాయి.
గ్రామంలోని పలు నివాసాల్లో అపరిచితులు చొరబడి విలువైన వస్తువులు, నగదు తదితరాలు అపహరించినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో డీసీపీ బి.లక్ష్మీనారాయణ దొంగతనాలు జరిగిన నివాసాలను స్వయంగా పరిశీలించారు.
బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన, దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుని దోషులను త్వరితగతిన పట్టుకుంటామని తెలిపిన ఏసిపి రామచంద్రరావు.
Next Story




