Vissannapeta: రాత్రి వేళ గ్రావెల్ దందా.. అధికారుల పేరుతో బ్రోకర్ హల్‌చల్
Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గ్రావెల్ అక్రమ రవాణా బట్టబయలైంది.
Vissannapeta: రాత్రి వేళ గ్రావెల్ దందా.. అధికారుల పేరుతో బ్రోకర్ హల్‌చల్
విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా గ్రావెల్ దందా సాగుతోంది. రాత్రి పూట ట్రిప్పర్ లారీలతో గ్రావెల్‌ను పక్క జిల్లాలకు తరలిస్తున్న వైనం బట్టబయలైంది. విస్సన్నపేట ఎమ్మార్వో, ఎస్సైకు డబ్బులు ఇస్తున్నామంటూ ఓ బ్రోకర్ మూడు నెలలుగా ఈ అక్రమ రవాణా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామ శివారులోని ఓ గట్టు దగ్గర ప్రతి రాత్రి హడావిడి జరుగుతోంది. రాత్రి 10 గంటలు దాటితే చాలు.. ట్రిప్పర్ లారీలు వరుస కడుతున్నాయి. అక్రమంగా గ్రావెల్ లోడ్ చేసి పక్క జిల్లాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు 6 ట్రిప్పుల వరకు గ్రావెల్ తోలకాలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటే.. ఓ బ్రోకర్ ఈ తతంగం అంతా నడిపిస్తున్నాడు
విస్సన్నపేట ఎమ్మార్వో గారికి, ఎస్సై గారికి మామూళ్లు ఇస్తున్నాం. మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని చెప్పి గత మూడు నెలలుగా ఈ దందా కొనసాగిస్తున్నాడట. అధికారుల పేరు చెప్పి గ్రావెల్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది.
అయితే ఈ విషయం ఇప్పుడు బయటకు పొక్కింది. రాత్రి పూట గ్రావెల్ లారీల సౌండ్‌తో నిద్ర కరువైన స్థానికులు నిలదీయడంతో అసలు గుట్టు రట్టయింది. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు, అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వో, ఎస్సై పేర్లు బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి.




