Thiruvuru: తిరువూరులో రూ.50 కోట్ల ప్రభుత్వ భూముల స్వాహా స్వామిదాస్

Thiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు బట్టబయలు. వైసీపీ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంచలన ఆరోపణలు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 16 Aug 2026 7:22 PM IST
Thiruvuru
X

Thiruvuru: తిరువూరులో రూ.50 కోట్ల ప్రభుత్వ భూముల స్వాహా స్వామిదాస్

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తోటమూలలో రూ.50 కోట్ల ప్రభుత్వ భూముల స్వాహా వైసీపీ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంచలన ఆరోపణలు. తోటమూల రింగ్ సెంటర్‌లో అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం బట్టబయలు జీవో నెంబర్ 30ను అడ్డం పెట్టుకుని 23 సెంట్ల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని అడ్డదారిగా వాడుకున్న అధికారులు

బహిరంగ మార్కెట్లో గజం రూ.5,800.. అక్రమంగా రూ.1,600కే రిజిస్ట్రేషన్ మార్కెట్ ధర కంటే మూడో వంతు ధరకే ప్రభుత్వ భూమి కట్టబెట్టిన వైనం నూజివీడు- మధిర ప్రధాన రహదారికి ఆనుకుని విలువైన ప్రభుత్వ భూమి తిరువూరు నియోజకవర్గంలోనే అత్యంత ఖరీదైన స్థలంగా గుర్తింపు. సెంటు భూమి విలువ రూ.50 లక్షలకు పైమాటే సర్వే నెంబర్లు 62/1, 62/3, 62/4లలో అక్రమ నమోదు.

62/1లో 0.10 సెంట్లు, 62/3, 62/4లలో 0.75, 0.90 సెంట్ల చొప్పున అక్రమ రిజిస్ట్రేషన్లు. జూన్ 9, 2026న తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 5 అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ తాజా రిజిస్ట్రేషన్లు కేవలం 2 నెలల క్రితం జరిగాయని వెల్లడి జీవో క్లాజు 4/8 లో ఉల్లంఘన.. విలువైన భూమిని క్రమబద్ధీకరించొద్దని నిబంధన అత్యంత విలువైన భూమిని అప్రూవల్ కమిటీ గానీ కలెక్టర్ గానీ క్రమబద్ధీకరించకూడదని స్పష్టత.

కమిటీ కన్వీనర్ తహసీల్దార్ పాత్రపై ప్రశ్నలు, కమిటీ మెంబర్ ఎంపీడీఓ వైఖరిపైనా అనుమానాలు. జిల్లా కలెక్టర్‌దే అనుమతి.. రూ.50 కోట్ల కమర్షియల్ ల్యాండ్‌ను ఎలా క్రమబద్ధీకరించారని ప్రశ్న వీఆర్వో, ఎమ్మార్వోలపై విచారణ చేపట్టాలని డిమాండ్. కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరపాలని వైసీపీ పట్టు. అక్రమ రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని వైసీపీ డిమాండ్

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించాలని పిలుపుప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాఖ్య ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని స్వామిదాస్ హెచ్చరిక పూర్తి ఆధారాలతో న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటనఆక్రమణలు వెనుక ఉన్న వారిని వదిలేది లేదు" అంటూ ఘాటుగా వ్యాకరించారు..

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story