Vijayawada: అవయవదానం మరొకరికి పునర్జన్మ: డాక్టర్ మన్నె హరీష్!

Vijayawada: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెత్ అయిన పునాదిపాడు వాసి కాసరనేని కరుణ కుమార్ అవయవాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో పోరంకి క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్యులు సేకరించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Nov 2026 5:21 PM IST
Vijayawada
X

Vijayawada: అవయవదానం మరొకరికి పునర్జన్మ: డాక్టర్ మన్నె హరీష్! 

Vijayawada: జయవాడ, నవంబర్ 28: మనిషి మరణించిన తరువాత కూడా మరొకరి జీవితంలో జీవించి ఉండేందుకు అవయవదానం ఒక గొప్ప మార్గమని క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నె హరీష్ అన్నారు.కృష్ణా జిల్లా పునాదిపాడు గ్రామానికి చెందిన కాసరనేని కరుణ కుమార్ (63) నవంబర్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెదడులో రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆయనను పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్‌కు తరలించారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఆయన ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం వైద్యులు ఆయనకు బ్రెయిన్ డెత్ అయినట్లు నిర్ధారించారు.

ఈ నేపథ్యంలో, మరణానంతరం తన అవయవాలను ఇతరులకు దానం చేయాలనే ఆయన సంకల్పాన్ని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్యులు జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్ విభాగం ప్రతినిధులను సంప్రదించారు. జీవన్‌దాన్ సంస్థ సమన్వయంతో వైద్యులు అవయవాలను సేకరించి, అవసరమైన వివిధ ఆసుపత్రులకు గ్రీన్ చానల్ ద్వారా తరలించారు.ఈ సందర్భంగా డాక్టర్ మన్నె హరీష్ మాట్లాడుతూ, ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తుల సంకల్పం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడటమే కాకుండా, మరికొందరికి కొత్త జీవితాన్ని పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకుని, అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జీవన్‌దాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్ డాక్టర్ ఎ. విష్ణువర్ధన్, సంస్థ ప్రధాన వైద్యులు డాక్టర్ వి. మన్మధరావు, క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య బృందం మృతుని కుటుంబ సభ్యులు, బంధువులను అభినందించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.