Machilipatnam: మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్లు లీకై ఇద్దరికి తీవ్ర గాయాలు

Machilipatnam: మచిలీపట్నంలోని బెల్ కంపెనీ వెనుక రోడ్డులో ఆక్సిజన్ సిలిండర్లు లీకై భారీ విస్ఫోటనం సంభవించింది. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఆస్తి నష్టం వాటిల్లింది.

Reddy, Pedana
Published on: 12 Aug 2026 11:28 AM IST
Machilipatnam
X

Machilipatnam: మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్లు లీకై ఇద్దరికి తీవ్ర గాయాలు

Machilipatnam: మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలెండర్లు లీకై భారీ విస్పోటనం. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు వ్యక్తులు క్షతగాత్రులను హుటాహుటిన ఆంధ్ర హాస్పటల్ కు తరలింపు.

బెల్ కంపెనీ వెనుక రోడ్డులో ఘటన, గ్యాస్ లీక్ అవ్వడంతో సమీపంలో ఉన్న గృహాలు, మనుషులు, వాహనాలపైకి దూసుకువెళ్లిన సిలెండర్లు.

ఓ ఇంటి గోడలు బద్దలవ్వగా, కారు, ద్విచక్ర వాహనాలు ద్వంసం, జనావాసాల మధ్య ఆక్సిజన్ సిలెండర్లు అద్దెకు ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం. తక్షణమే ఇక్కడి నుండి సిలెండర్లు తొలగించాలని ఆందోళనకు దిగిన స్థానికులు. ఘటనా స్థలిని పరిశీలించిన జిల్లా ఫైర్ ఆఫీసర్ యేసురత్నం. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం - జిల్లా ఫైర్ ఆఫీసర్.

Reddy, Pedana

Reddy, Pedana

Next Story