Nuzvid: నూజివీడు మండలం పల్లెర్లమూడిలో ఘనంగా పీ-4 అవగాహన సదస్సు!
Nuzvid: నూజివీడు మండలం పల్లెర్లమూడిలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి పర్యటన. పీ-4 కార్యక్రమంపై అవగాహన సదస్సు మరియు పింఛన్ల పంపిణీ.
Nuzvid: నూజివీడు మండలం పల్లెర్లమూడిలో ఘనంగా పీ-4 అవగాహన సదస్సు!
Nuzvid: నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో గురువారం పేదల సేవలో ఎన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లు పంపిణీ అనంతరం,రెండున్నర ఏళ్లలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలలో ఏ మార్పు వచ్చింది,గ్రామాలకు ఏమి కావాలి,ప్రజలకు ఉన్న సమస్యలు,ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం పీ-4 కార్యక్రమం అవగాహన సదస్సులో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంయుక్తంగా పాల్గొన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు,ఇతర సమస్యలుపై గ్రామస్తులు తమ అభిప్రాయాలను,సమస్యలను వెల్లడించారు.దీంతో స్పందించిన మంత్రి కొలుసు పార్థసారథి,జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంయుక్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అందిస్తామని,అభివృద్ధి కార్యక్రమాలు దశలు వారీగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
బంగారు కుటుంబాలను దత్తత చేసుకున్న మార్గదర్శలను మంత్రి,జిల్లా కలెక్టరు సంయుక్తంగా పూలమాలలు వేసి,శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు ప్రకారం సమాజంలో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి పీ-4 కార్యక్రమంకు మొదట్లో ఎన్నో విమర్శనలు వచ్చాయని,ఫలితాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చాయని దేశంలో అన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమాలు వైపు చూసి,ఆలోచన చేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నను నిరుపేదలకు ఒక వరం అని అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం తాత్కాలిక సాయంగానే కాకుండా,ప్రతి నిరుపేద కుటుంబం ఆర్థికంగా స్థిరపడి,స్వంతంగా ఆదాయ వనరులను సృష్టించుకునేలా మార్గదర్శకత్వం చేయడం దీని ప్రధానఉద్దేశమని అన్నారు.సదస్సులు నిర్వహణ,పింఛన్ల పంపిణీతో పాటు గ్రామ/వార్డు సచివాలయాలు పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పీ-4 అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.
పీ-4 కార్యక్రమం ద్వారా అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వ చేయూతను ఎలా ఉపయోగించు కోవాలో,మార్గదర్శిలకు వివరించి, బంగారు కుటుంబాలను దత్తత కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలన్నదే ఉద్దేశమని అన్నారు. పారదర్శక గృహనిర్మాణంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదలకూ, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ శాఖ ప్రధాన బాధ్యత అని,కాలనీల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
సమాజంలోని దాతలు,పారిశ్రామిక వేత్తలు,స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై పేదకుటుంబాలకు చేయూతనివ్వాలని పిలుపు నిచ్చారు.గత ప్రభుత్వ నేతలకు అభివృద్ధి,సంక్షేమం,ఇటువంటి మంచి కార్యక్రమాలు గురించి అసలు తెలియదని,వాళ్ళకు అరాచకం,విధ్వంసం మాత్రమే తెలుసునని అన్నారు.రెండున్నర ఏళ్లలో నూజివీడు నియోజక వర్గంలో 41 వేల మందికి వివిధ రకాలు పెన్షన్లు రూ 495.20 కోట్లు పింఛన్లు అందించామని, గత ప్రభుత్వం రూ 337.87 కోట్లు మాత్రమే ఇచ్చారని,అన్ని పథకాలు రెండంతలు పైగా నిరుపేదలకు లబ్ధిఅందిస్తున్నామని బహిరంగ చర్చకు రావాలని గత పాలకులకు మంత్రి సవాల్ విసిరారు.
జిల్లాలో 4871 మంది మార్గదర్శిలు 44,119 బంగారు కుటుంబాలకు స్వీకరించారని తెలిపారు, రానున్న కాలంలో ఈ సంఖ్యలు మరింత పెరిగేలా మనమంతా కలిసికట్టుగా కృషిచేద్దామని అన్నారు.నూజివీడు వర్గంలో 7,706 మార్గదర్శిలు 11,758 బంగారు కుటుంబాలుగా స్వీకరించారని, నిరుపేదలు పీ-4 లో ధరఖాస్తులు చేసుకుంటే శక్తివంచన లేకుండా మార్గదర్శిలు ముందుకు వచ్చేలా మా వంతు కృషిచేసి,బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని,అభివృద్ధి కార్యక్రమాలు దశలు వారీగా పూర్తి చేస్తామని అన్నారు.రెండున్నర సంవత్సరాలలో జిల్లాలో 407 కిలోమీటర్లు రహదారులు ఏర్పాటు చేసుకున్నామని, పల్లె పండుగ 3.0 జిల్లాలో రూ 155 కోట్లతో గ్రామసీమలు రూపురేఖలు మారపోతున్నాయని అన్నారు.వచ్చే సంవత్సరం మార్చి నాటికి భూసమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
సమాజంలో నిరుపేదటుంబాలను గుర్తించి,వారిని ఆర్థికంగా,సామాజికంగా బలోపేతం చేయడమే పీ-4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు.క్షేత్రస్థాయిలో అర్హులైన పేదకుటుంబాలను గుర్తించి,వారికి అవసరమైన వనరులు,శిక్షణ,నైపుణ్యాభివృద్ది,ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను అధికారులు చిత్తశుద్ధితో నిర్వహించాలని అన్నారు.
దాతలు,ప్రైవేటు భాగస్వామం విధానంలో సమాజంలోని దాతలు,పారిశ్రామికవేత్తలు,స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిపేద కుటుంబాలకు చేయూతనిచ్చేలా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న,నియోజకవర్గం ప్రత్యేక అధికారి రవికుమార్,డిఆర్డిఏ అడిషనల్ పిడి ఇ.అనిత,డియల్డివో పి.అనురాధ,డివిజనల్ పంచాయతీ అధికారి యం.పి.యన్.సుందరి,తహశీల్దారు షేక్ సంసిద్దీన్,యంపిడివో పి.సాంబశివ రావు,వివిధ శాఖలు అధికారులు,స్థానిక నాయకులు,కూటమి నాయకులు,స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




