Pamarru: పామర్రులో పీజీఆర్ఎస్ కార్యక్రమం.. కలెక్టర్, ఎమ్మెల్యే హాజరు

Pamarru: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు.

Bhanu, Pamarru
Published on: 3 July 2026 5:51 PM IST
Pamarru
X

Pamarru: పామర్రులో పీజీఆర్ఎస్ కార్యక్రమం.. కలెక్టర్, ఎమ్మెల్యే హాజరు

Pamarru: పామర్రు నియోజకవర్గంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్, ఎమ్మెల్యే వివిధ సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి అర్జీని పరిశీలించి, అర్హమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, వేగంగా అందించడమే పీజీఆర్ఎస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Bhanu, Pamarru

Bhanu, Pamarru

Next Story