Krishna: నాటకమే జీవితం.. అఖిల భారత పోటీలకు వేదికైన వుయ్యూరు!
Krishna: కృష్ణా జిల్లా వుయ్యూరులో ఘనంగా పరుచూరి రఘుబాబు 36వ అఖిల భారత నాటక పోటీలు.
Krishna: నాటకమే జీవితం.. అఖిల భారత పోటీలకు వేదికైన వుయ్యూరు!
కృష్ణా జిల్లా: పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ (హైదరాబాద్), శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థలు (వుయ్యూరు), పరుచూరి సేవా సమితి (విజయవాడ) సంయుక్త ఆధ్వర్యంలో “పరుచూరి రఘుబాబు స్మారక 36వ అఖిల భారత నాటక పోటీలు” ఈ నెల 27వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు వుయ్యూరులోని శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నాటకోత్సవాలు సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి.
నాటక రంగంలో ఈ మెమోరియల్ కార్యక్రమాలు ఎన్నో సేవలు చేశాయని పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. నాటకమే జీవితం గా భావించి అనేక మంది కళాకారులు ఈ వేదిక ద్వారా ప్రోత్సాహం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ, నాటకాలు సమాజానికి దారిదీపంగా నిలుస్తాయని, యువత నాటకరంగం వైపు ఆకర్షితులవ్వడం చాలా అవసరమని అన్నారు. కళల అభివృద్ధికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ, నాటకరంగం మన సంస్కృతిని ప్రతిబింబించే అద్దంలాంటిదని చెప్పారు. ఈ తరహా కార్యక్రమాలు గ్రామీణ కళాకారులకు మంచి వేదికగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సినీ దర్శకుడు వి ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, నాటకం సినిమాకు పునాది అని, మంచి కథలు ఇలాంటి వేదికల నుంచే వెలువడతాయని అన్నారు. యువ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. సినీ హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ, నాటకరంగం తనకు ఎంతో దగ్గరైనదని, వేదికపై నటించడం ఒక ప్రత్యేక అనుభూతి అని చెప్పారు. కొత్త తరం నటులు నాటకాల్లో పాల్గొని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు.




