Pedana: పెడనలో నిరుద్యోగ విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ

Pedana: పెడనలో పేద విద్యార్థుల కోసం ఉచిత పోటీ పరీక్షల శిక్షణ. శ్రీ విద్యానంద డిగ్రీ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించిన రైల్వే కమర్షియల్ సూపర్వైజర్ రామ్ సతీష్.

Reddy, Pedana
Published on: 28 Sept 2026 11:00 PM IST
Pedana
X

Pedana: పెడనలో నిరుద్యోగ విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ

పెడన: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల పోటి పరీక్షలపై విద్యార్థులు వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టుకుని పోటీ పరీక్షల్లో పాల్గొనటం చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల వారికి ఉచితంగా పోటీ పరీక్షలపై శిక్షణ క్లాసులను ఇవ్వటం కొరకు పట్టణంలో గల శ్రీ విద్యానంద డిగ్రీ కాలేజ్ నందు కొంతమంది విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించామని రైల్వే కమర్షియల్ సూపర్వైజర్ రామ్ సతీష్ తెలిపారు.

ఈ మేరకు పట్టణంలో గల విజయనంద డిగ్రీ కాలేజ్ నందు విద్యార్థులకు అవగాహన క్లాసును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కొరకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై రైల్వే, మొదలుకున్న ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాదించాలనుకునే పేద విద్యార్థులు తన వాట్సాప్ నెంబర్ 7981005657 ద్వారా సంప్రదించవలసిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ సుభాషిని అధ్యాపకులు విద్యాదర్ తదితరులు ఉన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana