Pedana: ఈ నెల 17న టీడీపీ క్యాడర్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ రాక

Pedana: పెడనలో ఈ నెల 17న జరగనున్న టీడీపీ క్యాడర్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరు. ఏర్పాట్లను పరిశీలించి విజయవంతం చేయాలని కోరిన గూడూరు మండల అధ్యక్షుడు.

Reddy, Pedana
Published on: 15 Sept 2026 11:25 PM IST
Pedana
X

Pedana: ఈ నెల 17న టీడీపీ క్యాడర్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ రాక

పెడన: నెల 17వ తేదీ గురువారం పెడన నియోజకవర్గంలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ హాజరుకానున్నారని ఈ కార్యక్రమానికి గూడూరు మండలాల్లోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు గోపీ నాగబాబు కోరారు.

పెడన పట్టణంలోని తామర చెరువు వద్ద మంత్రి నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి ర్యాలీగా మచిలీపట్నం–పెడన ప్రధాన రహదారి మీదుగా ఫ్లైఓవర్ ఎదురుగా ఉన్న బెరకా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని టీడీపీ క్యాడర్ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పర్యటనను విజయవంతం చేయలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి తోట వేణు, కూనప రెడ్డి పెద్దిరాజులు,ఎన్ ఏ బేగ్, పోతుల రాము,పుప్పాల సురేష్,బొల్లా రాజేష్,పూల నాగరాజు,మరియు నాయకులు పాల్గొన్నారు

Reddy, Pedana

Reddy, Pedana