Pedana: నడుపూరు, కొంకేపూడి గ్రామాల్లో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం!

Pedana: కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరు, కొంకేపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఎంపీటీసీ, జడ్పీటీసీ కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Reddy, Pedana
Updated on: 26 Oct 2026 8:09 AM IST
Pedana
X

Pedana: నడుపూరు, కొంకేపూడి గ్రామాల్లో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం!

Pedana: పెడన మండలం నడుపూరు గ్రామ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కాగితం రవి కిరణ్ కొంకేపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కట్టా నాగ తిరుమల పెడన మండలం జడ్పీటీసీ అభ్యర్థి కాగిత లక్ష్మి నాగేశ్వరరావు తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడుపూరు, కొంకేపూడి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన సమన్వయ కర్త లింగం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana